Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 128 సంకీర్తన: 129
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 170
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతభైరవి
నెలత నెడబాయనిదె - ని(త్యోత్సవము)
అలివేణి రతియె ది - వ్యౌషధము
॥పల్లవి॥
కవబాసి విరహాగ్ని - గాసిబడు విభునకు
ఉవిద నెమ్మోము చం-ద్రోదయమ్ము
చివురు విల్తుని కేళి - జివికిన చెలిమోవి
ధవళ నేత్రునకు జిం-తామణి
॥నెలత॥
చెమరుమైసతి తోడ - జింత బలుకనిపతికి
రమణి పలుకులె తేనె - రసములౌ శ్రుతికి
తమితోడ దనమేన - తలకొన్న ప్రియునకును
సమదమదనగజాంకు - శమ్ము కొనగోరు
॥నెలత॥
అలరుచును నేడు మా - యలమేలుమంగ మై
జిలుకు కుంకుమకాంతి - సిందూరము
యెలమితో శ్రీవేంక - టేశుడనిశము (సల్పు)
జలజాక్షి కూటమే - సంజీవి నగము
॥నెలత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము