Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 135 సంకీర్తన: 137
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
నెలతయుపరతి సలుప - నిబ్బరమున
(గులుకు గుబ్బల పడతి - గుబ్బ) తిల్లంగా
॥పల్లవి॥
కపురగంధపు జెమట - కరగి దిగ జారంగ
...............................................
...............................................
డపుడె గతులకు పాత్ర - యాడినట్లుండె
॥నెలత॥
గట్టిగుబ్బలు పట్టి - కడలు కదలాడంగ
పెట్టుకొను ముత్యాల - పేరులూగాడ
చిట్టకపు గాంతలును - చేరి నర్తింపగా
మట్టుగా అపరంజి - మడచి నట్లుండె
॥నెలత॥
కొండుక సింగపునడుము - గునిసి గునిసాడంగ
మెండుకొని గళరవము - మెరయగాను
వుండర శ్రీవేంకటప్ప - (డొగి జవుల)గూడి(తే)
పండు జిగురున పక్షి - పడ్డయట్లుండె
॥నెలత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము