Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 132 సంకీర్తన: 134
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 174
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పంతువరాళి
నేనెట్లు తాళుదు - నేనేల తగుదు
తానెట్టు నడచినా - తన చెల్లుబడియది
॥పల్లవి॥
వేడుకై కెంపు మో - విని పంట నానితే
నోడకందుకు నే - నొద్దందునా
వేడుకొనినా వినక - వేమారు పంటికొద్ది
కోడెగాలకు మోవి - కుమ్మెలు వోనొక్కితే
॥నేనెట్లు॥
సరసత నా గుబ్బ - చన్నులలమితే
గరువమా నందుకు నే - కాంతాళించ
గరుసిచ్చి (?) నాతోడి - కాంతలలో పైట
చెరగు వారించి గోర - జీరలు సేసితే
॥నేనెట్లు॥
చిత్తజుకేళి నను - శ్రీవేంకటప్రభుడు
పొత్తెట్లు పనిగొన్న - పొలుపు గాదందునా
అత్తింటి కోడలని - యనుచు నందరిలోన
కొత్తగా నెదనుంచి - కొలువు సేసేనంటె
॥నేనెట్లు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము