Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 205 సంకీర్తన: 215
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
నేనే వచ్చేగా నీయింటికి - నీవలయకురా
కానుక లంపకు మీ యీసరికే - (కాని) తప్పులయ్యీని జాణ!
॥పల్లవి॥
యెడమాటలాడకురా అయ్యయ్యో - యింతులు వినేరు
పడమట పొద్దుగూడినంతలోనే - పనులు లెస్సయ్యీని జాణ!
॥నేనే॥
సన్నలు సేయకురా అయ్యయ్యో - చాల చింతయ్యీని
కొన్నెల కూడినంతలోనే నిన్ను - గూడుకొనేగాని జాణ
॥నేనే॥
అలమేలుమంగను నన్నిట్టె - ఆరడిబెట్టకురా
కలికి శ్రీవేంకటనాథ నన్ను - గారవించి కూడితివి జాణ!
॥నేనే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము