సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 112 సంకీర్తన: 112
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 177
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 112 సంకీర్తన: 112
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 177
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| నే మానవతినౌట - నిజమాయ గాన క్షే(మంబు గూర్చుకొను - సి)ద్ధి యౌగాక | ॥పల్లవి॥ |
| యించువిలుకా(డట) - యించ నెంచీని పంచబాణములతో - భస్మమౌగాక మించి పున్నమరాజు - మిన్నంది కాసీని యించు కించుక కళా - హీనుడౌగాక | ॥నే॥ |
| (పలు)మారు పూదోట - పై నేగుదెం(చీని) చలిగాలి పెనుబాము - సమయించుగాక యెలమావికొమ్మపై - చెలరేగి పలి(కీని) చిలుక పంజరములో - (చెఱపడును) గాక | ॥నే॥ |
| (స్మరుడు విరహుల నేచు - సమయమే) పాయ సరసుడౌ (విభు గూర్చు) - సమయ మౌగాక మరుకేళి యలమేలు - మంగ శ్రీవేంకటపతి కరుణించి రతుల నను - కరిగించుగాక | ॥నే॥ |


