సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 122 సంకీర్తన: 123
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 179
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 122 సంకీర్తన: 123
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| పట్టరాని వయసిన్ని - పాట్ల బెట్ట యెట్టు వేగించవచ్చునే - యింతియైన దీనికి | ॥పల్లవి॥ |
| వడవేఁకి గాగ గు-బ్బల మీది పయ్యెద (నెడలించి గందమ్ము - నెదనలఁది ప్రియము వడిన యా కల వీడి) - వచ్చి యీ నడురేయి పడినదా విభు మీది - బాళి యెంతె దీనికి | ॥పట్టరాని॥ |
| గొంటరి కోవిలపోటు - కూఁతల ఘాతికి గంటైన వీనులు - గడియ వేసుకొని వొంటినే చప్పుడు సేయ -కూరకే వచ్చిన ప్రియ మంటిన విభుని మీది - యాసెంతె దీనికి | ॥పట్టరాని॥ |
| (తావి)పూములుకులు - తాళంగ లేక (తొవల) కౌఁగిటిజోడు - తోడు (చేసి)కొని యేవేళనలమేల్మంగ - యెంతైన మానదు శ్రీవేంకటవిభు మీది- చిత్తమెంతె దీనికి | ॥పట్టరాని॥ |


