Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 64 సంకీర్తన: 63
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 180
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఘంటారవం
పట్టాభిరామయా - బాలపై దయ చాల
బెట్టి చేపట్లేల - యిట్టి జాగేల
॥పల్లవి॥
వలపు నిలువగనీదు - కలికి తాళగలేదు
చెలియ మిక్కిలి సాదు - సిలుగు పెట్టగరాదు
వెలది నీకును బోదు - వలదు సుమ్మీ వాదు
చలపట్టగా రాదు - తలపు నీకే మీదు
॥పట్టాభిరామ॥
నెలతకు నీరాని - (పలు) బాసలేలరా
కలకాలమును బోర - కలికిదె మేర
మెలుత దేబోర! తమి - దలచి బిరబిర రార
(వలచు) నీ సతి జేర - వలదా రతిని మీర
॥పట్టాభిరామ॥
వనజశరుడు మృగాంక - వదనను నలువంక
ననతూపులను గొంక - కను నేసి కింక
ననువున శ్రీవేంక - టనివాస! నీ యంక
మున నుంచి పంకజ - (ముఖి) నేలు మింక
॥పట్టాభిరామ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము