సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 51 సంకీర్తన: 50
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 181
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 51 సంకీర్తన: 50
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 181
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| పడుచ! (నీ) విప్పుడే - (వలవంత గూర్చేవు కడు ప్రోడవై యెంత - గాసి) సేసెదవో | ॥పల్లవి॥ |
| తలిరుబోణి! యిపుడె - మొలచె నింతలు చనులు వెలయ ముందరి కేలె -విరిగేవే? కొలదిలే కవి మీరి - కొండ లంతేసిగా (చెలగిన) యపు డెంత - సేయగల దానవో | ॥పడుచ!॥ |
| చేడె! యిప్పుడె కురులు - తోడాయె నిదె జడకు వేడుక వెనుక కేల - విరిగేవే? మోడు వీ డవి మీద - మోపరాని పాటిగా గూడగల యపు డెట్టి - జాడ నుండేవో | ॥పడుచ!॥ |
| భామ! యిపుడు వేంకట - పతి చెట్టబట్టేవు యీమారు యిరుమేల - నేల విరిగేవే? ప్రేమ కడు మీరగా - పెచ్చుపెరిగిన రతి సీమ నేలే యప్పు - డే మేర నుందువో | ॥పడుచ!॥ |


