Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 149 సంకీర్తన: 152
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 184
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాలం
పనివినుము ఓ పన్నగశయన - పాపాత్ముడు వీడనక
ఏనిక గాచేదే బిరుదయ్య - బృందారక మునివంద్య
॥పల్లవి॥
నిను సేవించగ నే నేర - నిలువెల్లా దబ్బర
మనమున భక్తి మరింతైనా లేదు - మదమత్సరములు చాలా
అనుదినమును సేసే పాపాలకు - నాదియు నంతము లేదు
నను నెటు రక్షించేవో - నగధర! నీ కృప నుంచీ
॥పని॥
ఉపవాస వ్రతములనే - (వు)సురు డాగ నే నోప
జప (తపముల) గొడ వెరుగను - జడుడను నల్పుడ, (నిన్నే)
నెపమున నైనా దలచ (ని) - నేరము లెంచక (మున్నీ)
యపరాధము సహించి కావు - మర్జునసారథి! నన్నును
॥పని॥
వేదశాస్త్ర (విధు) లెరుగను - వెతతో తిరుగుచు నుందును
సాదువులను సరకు (గొనక) - సర్వజ్ఞుడ నని యుందును
మోదముతో వెంకటరమణ! - మోసము సేయకు నను, నీ
పాదసేవకును (పనిగొను) - పరమదయాళో! నన్నును
॥పని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము