సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 14 సంకీర్తన: 10
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 185
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 14 సంకీర్తన: 10
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| (పరమయోగిని శివా-ర్పణ బుద్ధిగాదిది)[1] (తరుణి తాపము వింత - తపమాయగాని)[2] | ॥పల్లవి॥ |
| విరహతాపముచేత - పొరలి పొరలిన వీడి సరసంపునెరివేణి - జడగట్టెగాని అరుదైన చింతతో - (నలయుచు)[3]ను దినదినము సరసిజానన మేను - సగమాయగాని | ॥పరమ॥ |
| (కలకంఠిగళనీల - గరళమ్ము)[4] గాదిది నలువైన నీలమణి - నాయకముగాని తెలుపైన నిజభూతి - దేహంబు గాదిది దళమైన కపురగం - ధపుపూతగాని | ॥పరమ॥ |
| తరుణ కోమల సు(ధా - కరురేఖ గాదిది)[5] తిరువేంకటేశుఁ(డ-ద్దిన)[6] నఖము గాని పరగంగ వైరాగ్య - భావంబు గాదిది (వ)[7]ర వధూమణికి పర - వశమాయ గాని | ॥పరమ॥ |
[1] (లుప్త పూరణము)
[2] (లుప్త పూరణము)
[3] నొలయుచును
[4] నీలగళము గాదయంత
[5] లుప్తము
[6] డుదిదిన
[7] ప


