సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 30 సంకీర్తన: 28
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 186
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 30 సంకీర్తన: 28
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| పసగల ద్వారకా - బాలకృష్ణునిగూడి (వస) దప్పి మీరేల - (వ)లచబొయ్యెదరో | ॥పల్లవి॥ |
| చిలుక లేలికచేత - శెలవు తీసుక వచ్చి కలికితో సమరంబు - గావించగా తిలకించి కంకణ - దీప్తి (మెఱయగ) జూచి పలుక జాలక యేల - పారిపొయ్యెదరో! | ॥పసగల॥ |
| కో(వి)లలు తమలోన - గుంపు గుంపులు గూడి ఆవ లీవల కయ్య - మందుకొనగా ఆవేళ నీ వీణి - యను మీటి (శ్రుతి) సేయ (చేవ) దప్పుచు నేల - చెదరి పొయ్యదరో! | ॥పసగల॥ |
| మదభృంగములు చేరి - మగువతో చల(పోరి) పొదల మరుగున జగడ - మొనరించగా ముదమలర బాల తన - మోము జూపగ (వెఱచి) యెదురాడ లేకేల - బెదరి పొయ్యెదరో! | ॥పసగల॥ |
| నిండుచందురుడు తన - నెఱవై(న) వురవడిని యండదండలచేత - నదరించగా దండైన ఉరవీఢి - తరుణి చూపిన యంత కొండ మరుగుకు పోయి - గోడు కుడిచెదరో! | ॥పసగల॥ |


