సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 36 సంకీర్తన: 35
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 187
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 36 సంకీర్తన: 35
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 187
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| పసిఁడి మెరపుతీగ భావమేమో - వో యక్కలాల పఁడతి యొకతె మెలఁగుచున్నదే | ॥పల్లవి॥ |
| కమలమందు అరటి గాసెనే వో యక్కలాల కామునింటి మీఁద గగనమే రోమరేఖ పసిడికుండలే వో యక్కలాల సోముకళలు నీలమేఘమే | ॥పసిఁడి॥ |
| పగడమందు కెంపు బుట్టె నే - వో యక్కలాల పైని చందమామ తోఁచెనే మిగులమంచి తెల్ల దామెరల - వో యక్కలాల మించి యెఱ్ఱదనము గలిగెనే | ॥పసిఁడి॥ |
| యిరులబొదల తారలమరేనే - వో యక్కలాల సరవి వింతల కలికి కూడఁగనే సరసుఁడై శ్రీవేంకటేశుఁడే - వో యక్కలాల (కరఁగి తా)నుపరతుల (గలియగనే) | ॥పసిఁడి॥ |


