Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 80 సంకీర్తన: 79
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
పుట్టుభోగీంద్రుడే - పులకోర్వఁడిక రావె
నెట్టన నీపతి (కి - నీకు) మొక్కెదను
॥పల్లవి॥
తెలిమల్లిమొగ్గ మ - ట్టెలగంటు లేని పో
ట్లుల రమణుని మేను - పులిపులియై
కలికి! నీ చనుదోయి - గజనిమ్మ పండ్లకా
కలగాని మానదా - కాయంబు నొవ్వి
॥పుట్టు॥
పమ్మిపుప్పొడి నెరసు - పడి యెర్రనై కన్ను
దమ్ములను నల నీరు - గమ్మె నేడు
కొమ్మ నీ మైమరపు - కోకావియద్దు లే
తెమ్మబడు కన్నులకు - తెరపియౌ గాని
॥పుట్టు॥
పెలుచరేయెండ నే - బెగడుకొని నాయకుడు
తలకొన్నవెతలచే - దప్పిదీర
నలమేలుమంగ శ్రీవేంక-టాధీశ వడదీర
పొలచు నధరంపు క - ప్పుర వీడెమీవె
॥పుట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము