అధ్యాత్మ సంకీర్తన
రేకు: 284-2
సంపుటము: 3-483
రేకు: 284-2
సంపుటము: 3-483
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| కాను స్వతంత్రుఁడననఁ గాదని తలఁగ లేను నేను నీ కింకరుఁడ నీ రచనలే | ॥పల్లవి॥ |
| యెంతైనాఁ దీరదిదే యెందుచూచిన పనులు అంతటాను నీమాయ అలయించగా దొంతులగుఁ గర్మములు తోడనే తిరిగీని సంతకూటపు బ్రతుకు సటలఁబెట్టీని | ॥కాను॥ |
| మాన వింద్రియము లివి మతిలోనఁ బెరరేఁచు నానాగము(తు?)లఁ బ్రకృతి నటియించఁగా పూని పురాకృతములు పోనీక తిరిగీని సానఁ బట్టిన వయసు సటలఁబెట్టీని | ॥కాను॥ |
| తరవులనే పెట్టీని తతిలేని యాసలివి నిరతంపు జన్మములు నిడుసాగఁగా వరుస శ్రీవేంకటేశ్వర నీవు నన్నేలి కరుణించఁగా భక్తి ఘనత మీరీని | ॥కాను॥ |


