సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 93 సంకీర్తన: 92
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 236
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 93 సంకీర్తన: 92
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
| వలచినందుకు గురుతు - వలె గాక, వూరకే వలచితి ననుకో - వలె నటే తరుణి? | ॥పల్లవి॥ |
| అరుదైన తన ప్రాణ - పదమైన విభు రాక కెదురు చూడగ సంధు - లదరంగ వలదా? ముదముతో తన పతిని - మదిలోన దలచితే మదన సదనమునందు - పద నెంచ వలదా? | ॥వలచినందుకు॥ |
| సదయుడు తన స్వామి - యదె వచ్చె నని వింటె వుదుటుగుబ్బలు మిగుల - నుప్పొంగ వలదా? కదిసి తన నాయకుని - కనులార జూచితే పొదలి తన మేనెల్ల - పులకించ వలదా? | ॥వలచినందుకు॥ |
| పొలుచు తన వల్లభుని - పలుకు చెవులను వింటె కలియకనె పదహారు - కళ లూర వలదా? వెలది యలమేల్మంగ - వేంకటేశు గూడితే పొలయలుకలు మాని - పొందు గావలదా? | ॥వలచినందుకు॥ |


