సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 23 సంకీర్తన: 21
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 240
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 23 సంకీర్తన: 21
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 240
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - జంపె
| వారివారికి తె(వులు) - వాలాయముగ నరు(ని) (నారి) వంకను బుట్టె - నడుమ నొక తె(వులు) | ॥పల్లవి॥ |
| యతికి గోపంబైతె - యెడద బాయని తెవులు సతికి యవగుణమైతె - చాల తెవులు మతిహీనుడై సుతుఁడు - మాట వినకుంటేను ఆతని తలిదండ్రులకు - నాత్మలోఁ దెవులు | ॥వారివారికి॥ |
| పొరుగింట నే ప్రొద్దు - (పొరలేది) పెనుదెవులు వొరిమె లేని యూర - వున్నను దెవులు తరమెరుంగని దొరను - దగిలి కొలుచుట తెవులు సరిగానివారితో - జగడమే తెవులు | ॥వారివారికి॥ |
| ధనవంతుఁడై దాన - (ధర్మ)మెఱుఁగని తెవులు (నెనరుతో) నిల్లాలి - నేలనిది తెవులు అనుదినము శ్రీవేంక - (టాధీశు) గొలువని మనుజులకు నేప్రొద్దు - మనసులో తెవులు | ॥వారివారికి॥ |


