Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 24 సంకీర్తన: 22
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 241
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
వారివారికిఁ దగిన - వాఁడ లాలి
(కోరిన వారింటి - గుమ్మడ! లాలి)
॥పల్లవి॥
మీనమై జలనిధి - (మించు తరగల తొట్ల) మీద నూఁగినవాఁడ లాలి
ఆనందకమఠమై - అమృతంపు దొట్లలో - నంది వూఁగినవాఁడ లాలి
(కోనల గొండల - క్రోడమై వారాశి) గునిసివూఁగినవాఁడ లాలి
మానారసింహుఁడై - (మహి) కడపతొట్లలో - మరగివూఁగినవాఁడ లాలి
॥వారివారికి॥
వామనుఁడవై త్రిభు-వనము లను తొట్లలో - వరుసనూఁగినవాఁడ లాలి
రాముఁడై జమదగ్ని - రాజు తొట్లలోనూఁగు - రసికశిఖామణి లాలి
ఆ మీద రఘురాము - (ఁడై) పుష్పకపు తొట్ల - నంది వూఁగినవాఁడ లాలి
మామకొరకు గొల్ల - మందల తొట్లలో - మరఁగి వూఁగినవాఁడ లాలి
॥వారివారికి॥
తగు బుద్ధ రూపమున - ధర్మంపు తొట్లలో - తగిలి వూఁగినవాఁడ లాలి
పొగడొంద కలికివై - భూమి తొట్లలోన - పొసగనూఁగినవాఁడ లాలి
తగు నలమేల్మంగఁ - (దమిని) కౌఁగిలి తొట్ల - తగిలి వూఁగినవాఁడ లాలి
చిగురిం(చుమౌనిజన - చిత్తడోలిక లూఁగు) - శ్రీవేంకటారమణ లాలి
॥వారివారికి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము