సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 259 సంకీర్తన: 273
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 243
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 259 సంకీర్తన: 273
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 243
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| విజయీభవ శ్రీ - వేంకటరాయ విజయీభవ ముని - వినుత దైవరాయ | ॥పల్లవి॥ |
| భవబంధ మోచన - పంకజ లోచన భవచాప ఖండన - (బహు పాపదండన) కువలయ పాలన - కుంభీంద్ర లాలన దివిజేంద్ర రక్షణ - దితిసుత శిక్షణ | ॥విజయీభవ॥ |
| అకలంక చారిత్ర - హస్త కీలిత గాత్ర మకరాలయ గేహ - మధిత (స)మ్మోహ మకర కుండల కర్ణ - మహిత నీరద వర్ణ సకల సద్గుణజాల - సామ గాన(వి)లోల | ॥విజయీభవ॥ |
| ఖలజన భీషణ - కౌస్తుభ భూషణ విలసిత శారఙ్గచాప - వివిధ (తనూ)రూప బలిమద భంజన - పరమ నిరంజన అలమేలు మంగా స - హాయ వేంకటరాయ | ॥విజయీభవ॥ |


