సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 145 సంకీర్తన: 147
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 246
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 145 సంకీర్తన: 147
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 246
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| వీఁడివో యిదె [1]వింతదొంగ వేఁడిపాలు వెన్న [2]వెరఁజినదొంగ | ॥పల్లవి॥ |
| వెలయ నీటఁ జొప్పువేసేటి[3] దొంగ తలగాననీక దాఁగుదొంగ తలఁకక నేలదవ్వేటిదొంగ తెలిసి సందెకాడఁ దిరిగేటి[4] దొంగ | ॥వీఁడివో॥ |
| అడుగుకింద లోకమడఁచేటి[5] దొంగ అడరి తల్లికినైన నలుగుదొంగ అడవిలో నెలవైయున్న దొంగ తొడరి నీలికాసెతో నుండుదొంగ | ॥వీఁడివో॥ |
| మోస మింతులఁ జేయు మునిముచ్చుదొంగ రాసికెక్కిన గుఱ్ఱంపుదొంగ వేసాల కిటు వచ్చి వేంకటగిరిమీఁద మూసినముత్యమై ముదమందుదొంగ | ॥వీఁడివో॥ |
(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 322వ సంకీర్తనగా ఉంది.)
[1] వోయల - నిడురేకు 35.
[2] నెన్నలుఁబాలు
[3] వేసిన
[4] తిరుగాడు
[5] మఱఁచిన


