Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 39 సంకీర్తన: 38
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 255
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
శరణాగతవత్సల - సర్వసులభ
పురుషోత్తమ! నాచే నీవు - పూజ గొనవయ్యా
॥పల్లవి॥
ముంబరపు బ్రహ్మాండములు - మోచు నీ మీదనా
చెంబులోని నీళ్లు - చిలికించేది
పంబిన నిందిరాదేవి - పగిది వాసంతపు గా
మ్యంబు దీర నాచే నీవు - మజ్జనమాడవయ్య
॥శరణాగత॥
పట్టరాని విశ్వరూ - పముఁ జూపే నిన్ను నే
పెట్టెలోనా (బిగ్గ - బట్టి) కట్టేది
పట్టమేలే కౌసల్య గ - ర్భములో నున్నయట్లు చే
పట్టి వైకుంఠపు - పట్టు జేసుకోవయ్యా
॥శరణాగత॥
అల చరాచరము లా-రగించే నీకు నే
వెలయకుండతోనా నై - వేద్యమిచ్చేది
అలమేల్మంగ శ్రీవేంకటాద్రి - నాథునకు నే
వెలయ భరద్వాజ - విందు జేసుకోవయ్య
॥శరణాగత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము