సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 90 సంకీర్తన: 88
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 256
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 90 సంకీర్తన: 88
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 256
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| శరణుశరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతివల్లభా శరణు రాక్షసగర్వసంహర శరణు వేంకటనాయకా | ॥పల్లవి॥ |
| కమలధరుఁడును కమలమిత్రుఁడు కమలశత్రుఁడు పుత్రుఁడు క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా | ॥శరణు॥ |
| ఆనిమిషేంద్రులు మునులు దిక్పతు లమర కిన్నర సిద్ధులు ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా | ॥శరణు॥ |
| ఎన్నఁగల ప్రహ్లాదముఖ్యులు నిన్నుఁ గొలువఁగ వచ్చిరీ విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా | ॥శరణు॥ |


