Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 41 సంకీర్తన: 41
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
శ్రీనివాసా! జగదేకనాయకా! - శ్రితకల్పతరువ!
గానవిలోల! భక్తవత్సల! - కరుణించవే అప్పయ!
॥పల్లవి॥
సొలవక తిరుకచ్చి - నంబిపై బెట్టిన - చూపు నా పై బెట్టవయ్య!
చెలగి (నాపై) తొండ - మాన్‌ జక్రవర్తిపై - చేసిన దయ సేయుమయ్య!
యెలమి నన్ను దిరు - మల నంబిగారిని - ఏలినటువలె నేలుమయ్య!
పలుమాట లేటికి - వారి విన్నపముల - (నెలసి విన్నట్టులే) వినుమయ్య!
॥శ్రీనివాసా!॥
సరగున మును - నాథముని కిచ్చినట్టి - చనవు నాకు నియ్యుమయ్య!
కురువనంబిగారి - మీద నుంచినట్టి - కూర్మి నాపై నుంచుమయ్య!
అరుదుగ మును ననం - తాళువారి నేలి - నటువలె నన్నేలుమయ్య!
పరమార్థమును గని - (భృత్యుని)భృత్యుని - పలుకు లాలకించుమయ్య!
॥శ్రీనివాసా!॥
అలయక (మున్ను) రా - మానుజుల నేలిన - యటువలె నన్నేలుమయ్య!
తలపులోన నీ - దాసుల దాసుల - దాసుడనీ యనుమయ్య!
అలమేలుమంగ శ్రీవేంక - టప్పా! (మమ్ము) పూ - ర్వాచార్యుల జూచి (బ్రోచి)
వెలయ వారి దాసు - విన్నప (మాలించి) - వేవేగ జేకొనుమయ్య!
॥శ్రీనివాసా!॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము