Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 167 సంకీర్తన: 171
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 265
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
సకలం హేసఖి జానామి తత్‌
ప్రకటవిలాసం పరమం ధధసే[1]
॥పల్లవి॥
అలికమృగమదమయ మషీకలనో
జ్జ్వలతాం హేసఖి జానామి
లలితం తవ పల్లవితమనసి ని
శ్చలతర[2] మేఘశ్యామం ధధసే
॥సకలం॥
చారుకపోల స్థల కరాంచిత వి
చారం హేసఖి జానామి
నారాయణ మహినాయకశయనం
శ్రీరమణం తవ చిత్తే ధధసే
॥సకలం॥
ఘనకుచశైలాగ్రస్థిత విధుమణి
జననం హేసఖి జానామి
కనదురసా[3] వేంకటగిరి పతే
ర్వినుత భోగసుఖ విభవం ధధసే
॥సకలం॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 22వ సంకీర్తనగా ఉంది.)

[1] ‘ధత్సే’ యనియుండఁబోలును. నిడురేకు 106 వదసి, దదంసి, దదంసివాసి అని క్రమముగా ఈ పదరూపములున్నవి. దధాసి అను సాధురూపమును ఇట్లు అవ్యుత్పత్తిచే చెక్కినారు కాఁబోలు.
[2] నిశ్చలం మేఘ
[3] ఘనతయా వేంకట ‘దధ’ ధారణే - అను దాని రూపము కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము