సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 234 సంకీర్తన: 245
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 270
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 234 సంకీర్తన: 245
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 270
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| సారెకు నీ వోజ తెలియనైనా, మాకు - మారు చదువు చదువవలెను తేరక నీ మాట బొంకైనా నీ - తెలివి బొంకదాయెగా | ॥పల్లవి॥ |
| చుక్కపొడుపున వచ్చేనని మోవి - చుక్క పొడుపున వచ్చితివిగా మిక్కిలి నీ మాట బొంకైనా, నీ - మేను బొంకదాయను వొక్క పొద్దు చేసి వచ్చేననిన వాడ - వొక్క పొద్దు చేసి వచ్చితివిగా చక్కదనపు నీ మాట బొంకైనా, నీ - జాడ బొంకదాయగా | ॥సారెకు॥ |
| నెల తిరుగక వచ్చేనన్న నీ వొక - నెల తిరుగ వచ్చితివి కలికితనపు నీ మాట బొంకినా, నీ - కాలము బొంకదాయను యిల్లు జొచ్చి వచ్చేనని పొరు - గిల్లు జొచ్చి వచ్చితివిగా చెలిమి చేసి నీ మాట బొంకైనా, నీ - సేత బొంకదాయగా | ॥సారెకు॥ |
| సాము చేసి వచ్చేనని మరుని - సాము చేసి వచ్చితివిగా గామిడి నీ మాట బొంకైనా - కడు నీ రతి బొంకదాయను నేమపు శ్రీవేంకటనాథ వేడుకల - నించేనని కళలు నించితివిగా యేమయ్య నీ మాట బొంకైనా నీ - విపుడు బొంకవుగా | ॥సారెకు॥ |


