సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 81 సంకీర్తన: 81
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 271
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 81 సంకీర్తన: 81
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 271
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| స్వామి! చిత్తాన విచారించుకో - నీ(కిట్టి) తామసమ్మేటికి నన్ను - దయ జూడుమిపుడు | ॥పల్లవి॥ |
| కల్పకమిచ్చే ఫలము - కల్పకమీవలె గాక నల్పపు జెట్ల వేఁడ - నవి యిచ్చీన? వేల్పురాయఁడవు నీ - వియ్యవలె(నిటు)గాక అల్పుల వరాలడుగ - (నటులియ్యగలరా) | ॥స్వామి!॥ |
| కామధేనువిచ్చే పాడి - కామధేనువే గాక (యే) మేక మెడ చ - న్నీయ గలదా? నీ మహిమ యిచ్చే యలవి నీ - వియ్య వలె గాక (తామసుల) గొసరగా - తామీయగలరా? | ॥స్వామి!॥ |
| చింతామణిచ్చే యీవి - చింతామణే గాక (యెంతటి మగరాయైన) - నేమీయ గలదు? చెంత నలమేల్మంగ - శ్రీవేంకటేశ! నీ యంతవాడే గాక - అన్యులీయగలరా? | ॥స్వామి!॥ |


