సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 19 సంకీర్తన: 16
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 272
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 19 సంకీర్తన: 16
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 272
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - అట
| (స్వామి!) వేంకటరమణ - యేమిపరాకయ్య నామనవి యాలించి - నను నేలవయ్య | ॥పల్లవి॥ |
| నీవే నా తల్లివి - నీవే నా తండ్రివి నీవె నాపాలిపె - న్నిధాన మనుచు నేవేళ నామదిలో - నెంతైన నమ్మితే భావించి కరుణతో - బ్రోవరా వేమయ్య | ॥స్వామి!॥ |
| ఎందరను రక్షింప - వెంత సెలవుసేయ వందులో నేను నీ - కవుదునా బరువు కందర్పగురుఁడ నను - కావవే యిందరిలో సందడిని మరచేవు - స్వామీ అదేమయ్య | ॥స్వామి!॥ |
| నిన్ను నమ్మినవాని - కన్నడ జేసితే అన్యు లెవరైన నను - నాదరింతురటయ్య నన్నేలు కృపతోడ - నాపాలి వెంకటరమణ నిన్ను నమ్మితి నేను - నీవాఁడ నయ్య | ॥స్వామి!॥ |


