సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 97 సంకీర్తన: 97
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 273
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 97 సంకీర్తన: 97
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 273
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: సామంతం - అట
| సిగ్గుగల యాఁటదైతేఁ జేర వచ్చునా వొగ్గి నేఁ గా నీతో నొక్కటైతిఁ గాకా | ॥పల్లవి॥ |
| వొంటి వేగించఁగా లేక వొద్దికి వచ్చితిఁ గాక యింటికివచ్చిన మోహ మితవయ్యీనా మంట దేర నీతోను మాటలూ నాడేఁ గాక కంటకపు నీతో పొందు కానిదే కాదా | ॥సిగ్గు॥ |
| చిత్తము నిలుపలేక సెలవి నవ్వితిఁ గాక బత్తి సేయ నీమీఁద పాపము గాదా తత్తర మాపఁగలేక తప్పక చూచితిఁ గాక హత్తి నీతో మొగమోట మారడి కాదా | ॥సిగ్గు॥ |
| పొందు మరిగితిఁ గాన పొత్తుకు వచ్చితిఁ గాక చెంది వేగిరించ నీతోఁ జెల్లునా నాకు కందువఁ గూడితివి చాఁగలమఱ్ఱి చెన్నుఁడవై అందపు శ్రీవేంకటేశ అరుదా నాకు | ॥సిగ్గు॥ |
(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 21వ సంకీర్తనగా ఉంది.)


