Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 224 సంకీర్తన: 236
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 275
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
సిగ్గులు బడితే శృంగారము - చిగురెక్కీ సుమ్మీ
యెగ్గులుబట్టేవా రిందరిలో - యెవరున్నా(రనుమీ)
॥పల్లవి॥
పులిగోటిమీద నేమిటికి తట్టు - పునుగు (మెత్తేవు?), అది
పలుమారు చురచురమనునేమో - పన్నీట గడుగరే
శలగోటి తానెందుకంటే కడు - చలదియని యందురు
కొలదిగాదు వలరాచవెజ్జుచే - గు(ణము) సేయించుడీ
॥సిగ్గులు॥
(ఇ)దె పలుగెంపు వాతెరకు వీడె - మేమిటికిచ్చేరే, కాని
కదిమి కారపు వేడిచూపునేమొ - కర్పూరము మెత్తరే
యిది నవ్వుగాదు మానిసికాటు - యింతకంటె విషము
మదనశాస్త్రమెరింగినవారి చేత - మందు వెట్టించరే
॥సిగ్గులు॥
ఎలమి నీ చెక్కుచెమటల చేతు-లెందుకు దుడిచేరే
సొలయక పట్టితే కందునేమో - (సురటి) విసరరే
అలమేలుమంగ శ్రీవేంకటేశు - డెలమి నాకె గూడె
అలరువిలుతు తండ్రికాసతిచే - అలపులు దీర్చరే
॥సిగ్గులు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము