సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 253 సంకీర్తన: 266
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 277
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 253 సంకీర్తన: 266
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 277
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: లుప్తము
| సురలకు నరులకు సొరిది విన విన అరుదు తాళ్లపాక అన్నమయ్య పదములు | ॥పల్లవి॥ |
| చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ నక్కజపుమాఁతువజ్రాలై మెఱసీని నిక్కుటద్దములై మా నిలువునీడలు చూపీ నక్కర తాళ్లపాక అన్నమయ్య పదములు | ॥సురలకు॥ |
| పన్నీరై పైఁబూసీఁ గప్రంబై చలువ రేఁచీ మిన్నగలముత్యములై మెయినిండీని వెన్నుబలములై మావెంటవెంటఁ దిరిగీని అన్నిట తాళ్లపాక అన్నమయ్య పదములు | ॥సురలకు॥ |
| నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ పుట్టుతోనె గురువులై బోధీంచీని గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ నట్టె తాళ్లపాక అన్నమయ్య పదములు | ॥సురలకు॥ |


