Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 251 సంకీర్తన: 264
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 279
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - అట
సొగటాల సురతాణి[0] - సుదతి నేను
మగువల కీ మాట - మరి చెల్లునట రోరి
॥పల్లవి॥
దుగ[1] వేసి చను దువ్వి - తూగి పందెము లాడి (2)
తిగ వంచ[2]య(ని) దేర - తియ్య మోవికి(ని) (3+1=4)
నిగుడి చౌవంచి[3] -నిను జట్టిగొందురా (4+1=5)
వగ(ల) యి(త్తి)గ[4] వేసి - వలపిం(తు) నోరి (2x3=6)
॥సొగటాల॥
(చక్కు)[5] పడవేతునో - (సత్త)[6] గోరొత్తులకు
(యెక్కయు)1 (సరియు)2 దేర - చెక్కు నొక్కుదునో! (1+2=3)
మక్కువ (దచ్చుక)[7] వేసి - మాటికి వలపింతునో (2x4=8)
యెక్కువ తొమ్మిదివేసి - యిలు వెళ్ళని(య)నోరి ([9])
॥సొగటాల॥
ప(ది)ట పం(దె)ము వేసి - (ప్ర)క్క ప(వ)ళింతునో! ([10])
కదిసి (యి)బ్బారతో[11] - కౌగిలింతునో! ([12])
అదన శ్రీ వేంకటేశ! - యవ్వనుడవై కూ(డి)
ముదముతో కెమ్మోవి - ముద్దు (గొను మోరి)!
॥సొగటాల॥

సురతాణి = ఇంద్రాణి, భోగపత్ని. యెక్క
[1] దుగ
[2] తిగ
[3] చక్కు
[4] చౌవంచ
[5] ఇత్తిగ
[6] సత్త
[7] దచ్చుక
[8] ?
[9] ?
[10] బార
[11] ?
[12] విలువలు ద్యూత పరిభాషలోఉన్నవి. ఇందులో పాచిక లాడిన దివ్యులిద్దరూ పందేలు వేసుకొని అభిమత ఫలాలు అనుభవించారు
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము