సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 205 సంకీర్తన: 216
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 280
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 205 సంకీర్తన: 216
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 280
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| సొరిదినొకరి లెస్స - జూడ జాలమిగాక యిరవొందగ తనసొ - మ్మేమైనా పొయ్యీనా | ॥పల్లవి॥ |
| కొమ్మగుబ్బలు బంగారు - కుండలవలె నుండగా చిమ్ముల యీ నడుమేల - చిన్నబోయెనే అమ్మకచెల్ల! యివియెల్ల మ -ధ్యమరీతి యింతేకా కిమ్ముల జూడగా తన - సొమ్మేమైనా బొయ్యీనా | ॥సొరిది॥ |
| రామామణి నెమ్మొగము - రాజు వలె నుండగా నాముమేసే కురులేల - నల్లనాయనే మైమరచిన కుటిల - మార్గమింతే కాక ఆముకొన్న తన సొమ్మే - మైనా బొయ్యీనా | ॥సొరిది॥ |
| కలకంఠి మోవి మా - ణిక్యము వలె నుండగా మొలకదంతములేల - పలకబారీనే పలుదెరంగుల కఠిన - పాకమింతే కాక యిల శ్రీవేంకటపతి తన సొ - మ్మేమైనా బొయ్యీనా | ॥సొరిది॥ |


