సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 216 సంకీర్తన: 227
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 281
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 216 సంకీర్తన: 227
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 281
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| హరి యితండు హరుఁడతండు - ఆకారమొక్కటే (హరిహరులందున) - అధికులెవ్వరు (లేరు) | ॥పల్లవి॥ |
| నెరిగురు లితనికి - మరుజడ లతనికి నురగపర పితనికి - నురగము లతనికి విరిగన్ను లితనికి చి - చ్చఱ గన్నతనికి (గరుడఁ డీతనికి - ఘన వృషభ మతనికి) హరిణాక్షి వినవె యిం - దధికులెవ్వరు లేరు | ॥హరి॥ |
| శ్రీతరుణి యితనికి - శ్రీగౌరి యతనికి భూతలంబితనికి - శీతనగ మతనికి జాతిమణు లితనికి వి - షమణు లతనికి రీతిగంధ మితనికి - భూతిపూత లతనికి | ॥హరి॥ |
| కరిభయహరుఁ డితఁడు - కరిముఖుని గురుఁడతఁడు నరసింహుఁడితఁ డర్ధ - నారీశ్వరుం డతఁడు (మురవైరి యీ)తఁడు - పురహరుఁ డతఁడు పరగ శ్రీవేంకటశైల - పతి యీతఁడే అతఁడు | ॥హరి॥ |


