Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-4
సంపుటము: 1-152
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
కడుఁ జంచలములు కడు [1]నధ్రువములు
కడు నల్పములని కాదందురు
॥కడు॥
కర్మబోధ వికారంబులు
ధర్మతంత్ర సంధానములు
దుర్మదైక సందోహములు
కర్మదూరు లివి గాదందురు
॥కడు॥
పరమభాగవత భవ్య[2]మతులు
పరమబోధ సంభావకులు
తిరువేంకటగిరిదేవు సేవకులు
కరుణాధికు లివి గాదందురు
॥కడు॥

[1] ‘నద్రువ’ రేకు.

[2] ‘మమతలు’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము