అధ్యాత్మ సంకీర్తన
రేకు: 285-4
సంపుటము: 3-491
రేకు: 285-4
సంపుటము: 3-491
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అన్నిటి మూలం బతఁడు వెన్నుని కంటెను వేల్పులు లేరు | ॥పల్లవి॥ |
| పంచభూతముల ప్రపంచ మూలము ముంచిన బ్రహ్మకు మూలము పొంచిన జీవుల పుట్టుగు మూలము యెంచఁగ దైవము యితఁడే కాఁడా | ॥అన్ని॥ |
| వెనుకొని పొగడేటి వేదాల మూలము మునుల తపములకు మూలము ఘనయజ్ఞాదుల కర్మపు మూలము యెనలేని దైవ మితఁడే కాఁడా | ॥అన్ని॥ |
| అగపడి సురలకు నమృత మూలము ముగురు మూర్తులకు మూలము నగు శ్రీవేంకటనాథుఁడే మూలము యెగువ లోకపతి యితఁడే కాఁడా | ॥అన్ని॥ |


