అధ్యాత్మ సంకీర్తన
రేకు: 286-2
సంపుటము: 3-495
రేకు: 286-2
సంపుటము: 3-495
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతం
| నీ శరణమే గతి నే నితర మెరఁగ పాశబంధముల పనులేలయ్యా | ॥పల్లవి॥ |
| పూఁచిన తొలుకర్మంబులు భోగించక పోవు చాఁచుకున్నయీ శరీరగుణములు చాలునన్నఁ బోవు రేఁచిన జననమరణములు రెంటికిఁ దీసీని మోఁచివచ్చితే విజ్ఞాన మెరఁగఁగ మొదలికిఁ గొనకును యెడ యేదయ్యా | ॥నీశ॥ |
| కోరిన నా కోరికలు కొనసాగక పోవు బారిఁ బడుచు కాలము దా బడిఁ దగులక పోదు మేరతో పంచేంద్రియములు మెడచుట్టక పోవు యే రీతుల సంసారము గెలువఁగ నెదురుబడిని బలిమిఁక నేదయ్యా | ॥నీశ॥ |
| మనసును వాకునుఁ జేఁతయు మానుమన్నఁ బోవు తనువులోన నా యంతర్యామివి తలఁచక ఇఁకఁ బోదు ఘనుఁడవు శ్రీవేంకటపతి నన్నుఁ గావక ఇఁకఁ బోదు కనికానని యజ్ఞాన జంతువను కడమలెంచ నిఁకఁ గొల(లఁ?) దేదయ్యా | ॥నీశ॥ |


