అధ్యాత్మ సంకీర్తన
రేకు: 286-3
సంపుటము: 3-496
రేకు: 286-3
సంపుటము: 3-496
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| కడవ రాదు హరి ఘనమాయ । తెగి విడువఁగరాదు వేసరరాదు | ॥పల్లవి॥ |
| చూపుల యెదిటికి సోద్యంబైనది పాపపుణ్యముల ప్రపంచము తీపులు పుట్టించు దినదిన రుచులై పూపల సంసారభోగములు | ॥కడ॥ |
| మనసు లోపలికి మర్మంబైనది జననమరణముల శరీరము వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై కనకపుటాసల కర్మములు | ॥కడ॥ |
| తగు మోక్షమునకుఁ దాపయైన దిదె నగి హరిఁ దలఁచిన నాలుకిది వెగటు దీరె శ్రీవేంకటపతియై యగపడె నిపుడు పురాకృతము | ॥కడ॥ |


