అధ్యాత్మ సంకీర్తన
రేకు: 286-4
సంపుటము: 3-497
రేకు: 286-4
సంపుటము: 3-497
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| పంచేంద్రియములాల పంచభూతములాల అంచెలఁ దొమ్మి సేయకురో మీరు | ॥పల్లవి॥ |
| కొందరికి మంచివాఁడ కొందరికిఁ గానివాఁడ నిందకుఁ గీర్తికిఁ బొత్తు నే నొకఁడనే అంది నిద్దిరించువాఁడ నటు మేలుకొనువాఁడ బొందితో నెఱుక మఱపులకు నొక్కఁడనే | ॥పంచేం॥ |
| దైవము నిర్మించినది ధరణిఁ బొడమినది యీవలావలికిఁ బొత్తు యీ దేహమే వేవేలు పుణ్యములకు వెలయుఁ బాపములకు యీవల రెంటికి గురి ఇదివో నా మనసు | ॥పంచేం॥ |
| తుంచి సగమటు వోవు తోడనే సగము వచ్చు పంచి లోనికి వెలికిఁ బ్రాణమొక్కటే కొంచక శ్రీవేంకటేశుఁ గొలిచి నే శరణంటి మంచివాయఁ బనులెల్లా మమ్ముఁ గాచె నితఁడు | ॥పంచేం॥ |


