అధ్యాత్మ సంకీర్తన
రేకు: 287-3
సంపుటము: 3-502
సంస్కృతకీర్తన
రేకు: 287-3
సంపుటము: 3-502
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా | ॥పల్లవి॥ |
| పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా | ॥ఆనం॥ |
| భవరోగసంహరణ ప్రహ్లాదవరదా అవిరళ కేశవ ప్రహ్లాదవరదా పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా భవపితామహవంద్య ప్రహ్లాదవరదా | ॥ఆనం॥ |
| బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా ఫలితకరుణారస ప్రహ్లాదవరదా బలివంశకారణ ప్రహ్లాదవరదా | ॥ఆనం॥ |


