అధ్యాత్మ సంకీర్తన
రేకు: 287-4
సంపుటము: 3-503
రేకు: 287-4
సంపుటము: 3-503
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| పంతగాఁడు మిక్కిలి బంటతనమునను అంతటాఁ గలశాపుర హనుమంతరాయఁడు | ॥పల్లవి॥ |
| నీరధి చంగన దాఁటి నెట్టన లంకచొచ్చి శ్రీరాము నుంగరము సీతకిచ్చి మేరమీరి యక్షుఁ గొట్టి మేటి వనము వెఱికె ఆరయఁ గలశాపుర హనుమంతరాయఁడు | ॥పంత॥ |
| ఘాతతో లంక గాలిచి గక్కన లంకిణిఁ జంపి యీతలికి మగుడఁ దా నేతెంచి సీతాశిరోమణి శ్రీరామునకు నిచ్చె ఆతఁడే కలశాపుర హనుమంతరాయఁడు | ॥పంత॥ |
| అల రావణుని గెల్చి అయోధ్యాపురికి వచ్చి బలురాముని సీతతోఁ బట్టముగట్టి నిలిచె శ్రీవేంకటాద్రినిలయుని యెదుటను అలరెఁ గలశాపుర హనుమంతరాయఁడు | ॥పంత॥ |


