అధ్యాత్మ సంకీర్తన
రేకు: 288-6
సంపుటము: 3-511
రేకు: 288-6
సంపుటము: 3-511
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| సేవించి చేకొన్నవారి చేతి భాగ్యము వేవేగ రారో రక్షించీ విష్ణుఁ డీడను | ॥పల్లవి॥ |
| గరుడగంభము కాడ కడుఁ బ్రాణాచారులకు వరము లొసఁగీని శ్రీవల్లభుఁడు తిరమై కోనేటి చెంతఁ దీర్థఫలములెల్ల పరుషల కొఁగీని పరమాత్ముఁడు | ॥సేవిం॥ |
| సేన మొదలారి వద్ద చిత్తములో సుజ్ఞానము నానాగతిఁ బుట్టించీని నారాయణుఁడు కానుక పైఁడిగాదెల కాఁడఁ దన నిజరూపు అనుక పొడచూపీని అఖిలేశుఁడు | ॥సేవిం॥ |
| సన్నిధి గర్భగృహాన చనవిచ్చి మాటలాడి విన్నపాలు వినీ శ్రీవేంకటేశుఁడు యెన్నికఁ బాదాలవద్ద యిహముఁ బరముఁ జూపీ మన్ననల అలమేలుమంగవిభుఁడు | ॥సేవిం॥ |


