అధ్యాత్మ సంకీర్తన
రేకు: 289-1
సంపుటము: 3-512
రేకు: 289-1
సంపుటము: 3-512
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| చూడరో చూడరో నేఁడు సురలార నరులార దాడివోయి దనుజుల దండించి తా వచ్చె | ॥పల్లవి॥ |
| వాయు వేగమున వచ్చె వనజాక్షు నరదము వేయిసూర్యుల ప్రతాపవిభవముతో చాయల చక్రవాళాద్రి సముద్రాలు దాఁటి వచ్చె ఆయితమై పైఁడిటెక్కే లవే కానవచ్చె | ॥చూడ॥ |
| మునుకొని మనో వేగమున వచ్చె హరితేరు తనరారు కోటిచంద్రప్రభలతో వెనుకొని దిక్కులెల్లా విజయము సేసి వచ్చె కనకాచలముతో గక్కన సరివచ్చె | ॥చూడ॥ |
| గరుడవేగాన శ్రీవేంకటేశు రథము వచ్చె మరగిన యల మేలుమంగసిరితో ధరలోన వీధులేఁగి తన నెలవుకు వచ్చె పరగ హరిదాసుల పంతములు వచ్చె | ॥చూడ॥ |


