అధ్యాత్మ సంకీర్తన
రేకు: 289-3
సంపుటము: 3-514
సంస్కృతకీర్తన
రేకు: 289-3
సంపుటము: 3-514
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం | ॥పల్లవి॥ |
| విజయ నరసింహం వీర నరసింహం భుజబలపరాక్రమస్ఫుట నృసింహం రజనీచరవిదళనవిరాజిత నృసింహం సుజనరక్షక మహాశూర నరసింహం | ॥నమి॥ |
| దారుణనృసింహం ప్రతాప నరసింహం చారుకల్యాణ నిశ్చల నృసింహం ధీరచిత్తావాస దివ్య నరసింహం సారయోగానందచతుర నరసింహం | ॥నమి॥ |
| విమల నరసింహం విక్రమ నృసింహం కమనియ్యగుణగణాకర నృసింహం అమితసుశ్రీవేంకటాద్రి నరసింహం రమణియ్యభూషాభిరామ నరసింహం | ॥నమి॥ |


