అధ్యాత్మ సంకీర్తన
రేకు: 290-1
సంపుటము: 3-518
రేకు: 290-1
సంపుటము: 3-518
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కేరలీఁ బంతముల సుగ్రీవనారసింహము | ॥పల్లవి॥ |
| నిక్కిన కర్ణములతో నిట్టచూపు గుడ్లతో మిక్కుటమైన పెద్దమీసాలతోడ వెక్కసపు నోరితోడ వెలయు బుగ్గలతోడ క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవ నారసింహము | ॥దొర॥ |
| చల్లు నూరుపులతోడ సంకుఁజక్రములతోడ మొల్లమైన సహస్రకరములతోడ తెల్లని మేనితోడ దిండైన పిరుఁదుతోడ కెల్లు రేఁగీఁ గరుణ సుగ్రీవ నారసింహము | ॥దొర॥ |
| విరుల పాదాలతోడ వెలయు సొమ్ములతోడ తిరమైన కోటిసూర్యతేజముతోడ విరుల దండలతోడ వేడుక శ్రీవేంకట- గిరిమీఁద వెలసె సుగ్రీవ నారసింహము | ॥దొర॥ |


