అధ్యాత్మ సంకీర్తన
రేకు: 292-1
సంపుటము: 3-530
రేకు: 292-1
సంపుటము: 3-530
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| విశ్వమెల్ల నీ విరాడ్రూపము శాశ్వతహరి నీ శరణులము | ॥పల్లవి॥ |
| కన్నులఁ సూర్యుఁడు కమలాప్తుఁడు నీ- పన్నిన మోమున బ్రాహ్మణులు వున్నతి వైశ్యులు వూరువు లందును యెన్నఁగ శూద్రులు యిదె పాదముల | ॥విశ్వ॥ |
| యింద్రాది దేవతలీశాన బ్రహ్మము- నీంద్రు లంగములు నెసఁగిరదే సాంద్ర లోకములు జఠరంబున నవె రుంద్ర తేజ మదె రోమముల | ॥విశ్వ॥ |
| కాలముఁ గర్మముఁ గైవల్యంబును ఆలోను వెలియునది నీవు శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర కోలు ముందు నినుఁ గొలిచితిమయ్య | ॥విశ్వ॥ |


