అధ్యాత్మ సంకీర్తన
రేకు: 294-1
సంపుటము: 3-542
రేకు: 294-1
సంపుటము: 3-542
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| చవిచేసుక యిటు జరగెదము జవదాఁటకురో సంసారులార | ॥పల్లవి॥ |
| యేదిచూచినా నెరవెరవే పోదిఁ గూడఁగా పొదపింతే ఆదికినాది హరి యొకఁడే పాదుగఁ బుట్టెడి భవములె వేరు | ॥చవి॥ |
| కలుములు లేములు కతలింతే నిలుకడ గలచో నిజమౌను యిలయును జగమును యిదే యిదే తెలిసి చూడఁగా దినములే ఘనము | ॥చవి॥ |
| చెంతల నిందరు జీవులే బంతులఁ బుణ్యముఁ బాపమునే యింతట శ్రీవేంకటేశ్వరుఁడే కాంతలుఁ బురుషుల గతులై నిలిచె | ॥చవి॥ |


