అధ్యాత్మ సంకీర్తన
రేకు: 294-3
సంపుటము: 3-544
రేకు: 294-3
సంపుటము: 3-544
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| విశ్వాత్మ నీ కంటె వేరేమియునుఁ గాన ఐశ్వర్యమెల్ల నీ యతివ చందములే | ॥పల్లవి॥ |
| కలవు మతములు పెక్కు కర్మభేదములగుచు కలవెల్ల నీయందె కల్పితములే కలరు దేవతలు బహుగతుల మహిమల మెరయు అలరి వారెల్ల నీ యంగభేదములే | ॥విశ్వా॥ |
| ఘనమంత్రములు పెక్కు గలవు వరముల నొసఁగు ననిచి యవియెల్ల నీ నామంబులే పెనగొన్న జంతువులు పెక్కులెన్నే గలవు పనిగొన్న నీ దాసపరికరములే | ॥విశ్వా॥ |
| యెందును దగులువడ కేకరూపని నిన్ను కందువఁ గొలుచువాఁడే ఘనపుణ్యుఁడు అందపు శ్రీవేంకటాద్రీశ అన్నిటా- నందినపొందినవెల్లా హరి నీయనుమతే | ॥విశ్వా॥ |


