అధ్యాత్మ సంకీర్తన
రేకు: 294-4
సంపుటము: 3-545
రేకు: 294-4
సంపుటము: 3-545
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇహపరములకును యిది సుఖము సహజావస్థే జరగేటి సుఖము | ॥పల్లవి॥ |
| శ్రీరమణుఁడే చింతాయకుఁడని వూరక వుండుట వొక సుఖము కోరకుండఁగా గూడిన యర్థము ఆరయఁ గైకొను టది సుఖము | ॥ఇహ॥ |
| వసముగాని పని వడిఁ దలకెత్తుక అసురుసురుగాని దది సుఖము యెసరెత్తుక లేళ్లేవని తోలక పసఁ దనవిధిఁ గల పాటే సుఖము | ॥ఇహ॥ |
| పెక్కు చంచలము పెనచుక తిరుగక వొక్క సుఖంబౌ టురుసుఖము యెక్కువ శ్రీవేంకటేశ్వరు శరణని నిక్కితిమిదె మా నిజమే సుఖము | ॥ఇహ॥ |


