అధ్యాత్మ సంకీర్తన
రేకు: 294-5
సంపుటము: 3-546
రేకు: 294-5
సంపుటము: 3-546
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| వింటిమి నీ కతలు కంటిమి నీమాయలు బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా | ॥పల్లవి॥ |
| కలిగిరి నీవల్లనే కడఁగి బ్రహ్మాదులు నిలిచిరి సురలెల్లా నీవల్లనే తెలిసిరి మునులెల్లా దేవుఁడవు నీవేయని చలపట్టి హరి నీకు శరణనేమయ్యా | ॥వింటి॥ |
| నుతియించీ వేదములు నోరార నీ మహిమ గతియాయ వైకుంఠమే ఘనులకెల్లా ప్రతిలేని నీ రూపే భావించేరు యోగీంద్రులు తతితో శ్రీపతి నీకే దాసులమయ్యా | ॥వింటి॥ |
| అదె నీ చక్రముచేత నడఁగి రసురలెల్లా బదికిరి విప్రులు నీపాద సేవను పొదలి శ్రీవేంకటేశ పొంది నీ కరుణ చేత మొదల వెనక నీకే మొక్కేమయ్యా | ॥వింటి॥ |


