అధ్యాత్మ సంకీర్తన
రేకు: 295-3
సంపుటము: 3-550
రేకు: 295-3
సంపుటము: 3-550
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పుట్టుగులు నొక్కటే పుణ్యపాపములే వేరు యెట్టుసేసినాఁ జేసీ నేమి సేయవచ్చును | ॥పల్లవి॥ |
| పగలే రేయి యీబడిఁ గొన్నిజీవులకు వొగి నా రేయి పగలౌ నొకరికిని తగుదైవ మొకఁడే తమ మతములే వేరు పగటుల విష్ణుమాయ భ్రమయించీ నిదివో | ॥పుట్టు॥ |
| నిలువెల్లాఁ జేఁదే నెరిఁ గొన్నివృక్షములు కలదెల్లఁ దీపే కమ్మరఁ గొన్ని తలఁపును నొకటే తత్త్వములే వేరువేరు చెలరేఁగి విష్ణుమాయ చిక్కువెట్టీ నిదివో | ॥పుట్టు॥ |
| ఇహమే పరము యెరిఁగితేఁ గొందరికి మహిఁ బరమే ఇహము మరొకరికి వహితో శ్రీవేంకటేశు వలెనని కొలిచితే సహజపు విష్ణుమాయ జారిపోవునపుడే | ॥పుట్టు॥ |


