అధ్యాత్మ సంకీర్తన
రేకు: 295-6
సంపుటము: 3-553
రేకు: 295-6
సంపుటము: 3-553
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| ఇంక మా బోంట్ల కేది విధో కింకరులమనియెడి గెలుపే కాక | ॥పల్లవి॥ |
| యెవ్వరు గడచిరి యింతక తొలుతను నివ్వటిల్లు హరి నీమాయ నవ్వుచు నీ శరణాగతి నమ్మిన మువ్వంక శుకాదిమునులే కాక | ॥ఇంక॥ |
| కన్నవారెవ్వరు ఘన వైకుంఠము వున్నతమగు నీ వురుమహిమ మున్ను నిపుడు నీ ముద్రలు మోఁచిన అన్నిటా ఘనసనకాదులుఁ గాక | ॥ఇంక॥ |
| తెలియువారెవ్వరు దివ్యజ్ఞానము చలనముగాఁ జెప్పు శాస్త్రములు యిలలో శ్రీవేంకటేశ నీవారై చెలఁగిరి శేషాదిజీవులుఁ గాక | ॥ఇంక॥ |


